హుస్నాబాద్ నియోజకవర్గ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ
సిద్దిపేట:ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ 32-హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం హుస్నాబాద్ ని మంగళవారం రోజున హుస్నాబాద్ ఆర్డిఓ వి రామ్మూర్తి విడుదల చేశారు. ఈ సందర్బంగా 32-హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టరల్ రోల్ ) ను 17.08.2026 రోజున ప్రచురించినట్లు ఎన్నికల నమోదు అధికారి (ERO) మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి, హుస్నాబాద్ తెలిపారు. ఈ ముసాయిదా ఓటర్ల జాబితాలో పురుష ఓటర్లు – 1,13,501, మహిళా ఓటర్లు – 1,16,715, తృతీయ లింగ ఓటర్లు – 06, మొత్తం ఓటర్లు – 2,30,222 మంది ఉన్నారు.ఈ ఓటర్ల జాబితా తయారీకి 01.10.2026 ను అర్హత తేదీగా (క్వాలిఫైయింగ్ డేట్ ) నిర్ణయించారు. ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల నమోదు అధికారి కార్యాలయంలో మరియు సంబంధిత అన్ని పోలింగ్ కేంద్రాలలో కార్యాలయ వేళల్లో పరిశీలించవచ్చన్నారు.ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా మరియు ఇతర వివరాలను ప్రతి ఓటరు పరిశీలించుకోవాలని కోరారు. పేరును చేర్చడం, పేరుపై అభ్యంతరం తెలియజేయడం లేదా ఓటరు వివరాలలో మార్పులు/సవరణలు కోరడం కోసం వరుసగా ఫారం-6, ఫారం-7 మరియు ఫారం-8 ద్వారా 16.09.2026 లోపు క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలను సమర్పించవచ్చన్నారు. క్లెయిమ్‌లు మరియు అభ్యంతరాలను ఎన్నికల నమోదు అధికారి కార్యాలయంలో లేదా సంబంధిత తహసీల్దార్ / మున్సిపల్ కమిషనర్ / సహాయ ఎన్నికల నమోదు అధికారి (AERO) వద్ద సమర్పించవచ్చన్నారు.అలాగే, తదుపరి అర్హత తేదీ 01.10.2026 నాటికి 18 సంవత్సరాల వయస్సు పూర్తిచేసుకునే అర్హత కలిగిన పౌరులు కూడా ఫారం-6 ద్వారా ముందస్తుగా తమ పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేరు మరియు వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో తప్పనిసరిగా పరిశీలించుకోవాలని ఎన్నికల నమోదు అధికారి కోరారు.ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO),32-హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం &రెవెన్యూ డివిజనల్ అధికారి, హుస్నాబాద్ తెలిపారు.
Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 18:45:41
పాపన్నపేట.: ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంతో పాపన్నపేట గ్రామపంచాయతీ కారోబార్ ఆకుల కృష్ణ ప్రాణం పోయిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబాన్ని ఆదుకోవాలని మెదక్...
