బస్ స్టాండ్ ను ఆధునికీకరించండి

రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్..

బస్ స్టాండ్ ను ఆధునికీకరించండి

 
 

నిజామాబాద్ : నిజామాబాద్ బస్ స్టాండ్ ఆధునికీకరించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ కోరారు. హైదరాబాదులోని సెక్రటేరియట్ లో మంగళవారం రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..నూతన బస్ స్టాండ్ స్థలం కేటాయించాలని అనేక సార్లు మంత్రులను కలిసినట్లు గుర్తుచేశారు. అప్పటి వరకు ప్రస్తుత బస్ స్టాండ్ ను సౌకర్యాలను మెరుగుపర్చా లన్నారు. ప్రయాణికుల కోసం విశాలమైన వేచియుండే హాలు ఏర్పాటు చేయాలని, బస్సుల రాకపోకల సమాచారాన్ని అందించే డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే సీసీ కెమెరాలను,తగిన సిబ్బందిని నియమించాలన్నారు. ప్రైవేటు వాహనాలు, ఆటో రిక్షాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలన్నారు.
 
 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచాలి
మందమర్రి, (మంచిర్యాల) : జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు,ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలలో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని...
మూడు నెలల రేషన్ కోటాను సజావుగా పంపిణీ చేయాలి
తాండూర్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులకు సన్మానం.
నాన్యమైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం
చక్రియాల్‌లో హరితహారం వన మహోత్సవం ఘనంగా నిర్వహణ
తాండూరు బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జ్  శ్రీశైల్ రెడ్డి .
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు గడ్డపై టిఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం.