ప్రభుత్వం బాధ్యత వహించాలి... మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి.
ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి.
పాపన్నపేట.: ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంతో పాపన్నపేట గ్రామపంచాయతీ కారోబార్ ఆకుల కృష్ణ ప్రాణం పోయిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబాన్ని ఆదుకోవాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు... ఇటీవల మండల పరిధిలోని యూసుపేట శివార్ లో రోడ్డు ప్రమాదంలో మరణించిన కరోబారు ఆకుల కృష్ణ కుటుంబ సభ్యులను, సోమవారం నాడు పాపన్నపేటలో పరామర్శించి ఓదార్చారు.. సందర్భంగా మాట్లాడుతూ మెదక్ నుండి పాపన్నపేట ప్రధాన రహదారి అక్కడక్కడ గుంతల మయమైంది... ఈ గుంతలతో ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.... ఆకుల కృష్ణ ప్రమాదానికి రోడ్డు గుంతే ప్రధాన కారణమన్నారు... ఈ ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత వహించి కృష్ణ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు... పంచాయతీలో కారోబార్ గా కృష్ణ విధులు నిర్వహిస్తు మరణించినందున పంచాయతీరాజ్ శాఖలో కానీ , ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ లో కానీ కృష్ణ భార్యకు ఉద్యోగం కల్పించాలన్నారు.. వీరి వెంట బీ.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు పోతే దార్ మల్లన్న. మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు మహిపాల్. మాజీ ఏడుపాయల డైరెక్టర్లు కిషన్ రెడ్డి. సుంకరి కృష్ణ. కుమ్మరి పోచయ్య. నాయకులు . బి కొండ రాములు... బాల్ రాజ్.. రంగంపేట శీను. టప్ప రాములు. తదితరులు ఉన్నారు..
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 18:45:41
పాపన్నపేట.: ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంతో పాపన్నపేట గ్రామపంచాయతీ కారోబార్ ఆకుల కృష్ణ ప్రాణం పోయిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబాన్ని ఆదుకోవాలని మెదక్...
