తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం

తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యం

  • శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించాలి.
  • అంగన్ వాడి కేంద్రంలో ఘనంగా తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం.

తాండూరు : తల్లిపాలే శిశువుకు సంపూర్ణ ఆరోగ్యమని వడ్డెర గల్లి బస్తి దవాఖాన వైద్యురాలు డాక్టర్ రాజేశ్వరి, అంగన్వాడి టీచర్ రాజేశ్వరి, ఏఎన్ఎం శాంత తల్లిపాల వారోత్సవాలొ పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలు కర్యక్రమంలో భాగంగా బుధవారం తాండూరు పట్టణంలోని 33 వ వార్డు వడ్డెర గల్లి అంగన్వాడి కేంద్రం 1లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కర్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించాలని సూచించారు. తల్లిపాలలో ఉండే పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు శిశువు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిపారు. బిడ్డకు తొలి ఆరు నెలల వరకు పూర్తిగా తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, ఇతర ఆహార పదార్థాలు అందించకూడదని వివరించారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుతో పాటు తల్లి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లుల్లో గర్భాశయ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గే అవకాశాలు ఉంటాయని తెలిపారు. ప్రతి తల్లి తప్పనిసరిగా శిశువుకు తల్లిపాలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం లు శాంత, హనీష్ బేగం, ఆశ వర్కర్ సుజాత, అంగన్వాడి ఆయా లక్ష్మి,పాటు పలువురు గర్భిణులు, బాలింతలు, పిల్లలు పాల్గొన్నారు.  
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి  పాత వేతనాలకై కృషి చేస్తా :  చైర్ పర్సన్ సంధ్యారాణి 
మందమర్రి, (మంచిర్యాల) : క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో ఒప్పంద పద్ధతిన పని చేస్తున్న కార్మికులకు పాత ప్రకారమే వేతనాలు ఇప్పించేందుకు కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్...
చౌట్కూర్ ZPHSలో పరిశుభ్రత, ఆరోగ్య అలవాట్లపై అవగాహన సదస్సు
వరి సాగులో వేరు ముంచే పద్ధతిపై రైతులకు అవగాహన
హింసాత్మక రాజకీయాలకు కుట్రలు చేయడం సరికాదు.
బిజీనాపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత HPV టీకా
బోధన్ లో నీటి సరఫరాలో అంతరాయం.
హైవే రోడ్డుపై సీసీ కెమెరా ఏర్పాటు