తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం పోరాటం ఉధృతం

రోడ్డెక్కిన విద్యార్థులు, గ్రామ యువత

తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం పోరాటం ఉధృతం

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు వినతి పత్రం సమర్పించిన విద్యార్థులు 
 

మెదక్ : వెల్దుర్తి లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు, గ్రామ యువత రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం నుండి ఎలాంటి హామీ రాకపోవడంతో ఆగ్రహించిన విద్యార్థులు, యువకులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకొని "మాకు కావాలి తెలంగాణ పబ్లిక్ స్కూల్", "పేద విద్యార్థుల భవిష్యత్ కాపాడండి" అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఆందోళనకారులు మాట్లాడుతూ _"దూరంగా ఉన్న స్కూళ్లకు వెళ్లలేక చాలా మంది పిల్లల చదువులు ఆగిపోతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన ఉచిత విద్య అందించేందుకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ తప్పనిసరి. డిమాండ్ పరిష్కరించే వరకు ఈ పోరాటం ఆపము"_ అని తెలిపారు. స్థానిక నాయకులు, తల్లిదండ్రులు కూడా ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని జిల్లా కేంద్రం వరకు తీసుకెళ్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News