మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యం
- సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
- తెలంగాణ రాష్ట్ర కాగ్ సభ్యురాలు కళ్లెపు శోభారాణి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే ట్రాయ్ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర కాగ్ సభ్యురాలు కళ్లెపు శోభారాణి అన్నారు. సోమవారం మున్సిపల్ పరిధిలోని శివునిపల్లి పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు టెలికాం సంబంధిత వినియోగాలపై నిర్వహించిన సదస్సులో శోభారాణి మాట్లాడుతూ టెలికామ్, బ్రాడ్‌కాస్టింగ్ విభాగాల్లోని వివిధ రకాల ప్లాన్లు (పోస్ట్‌పెయిడ్, ప్రిపెయిడ్, ప్లాన్ వోచర్లు, 30 రోజుల ప్లాన్లు, వాయిస్, ఎస్ఎమ్‌ఎస్ ప్లాన్లు), బిల్లింగ్ నిబంధనలు, ఓటీటీ మరియు బండిల్డ్ సేవలు 'పీఎం వాణి' పథకం గురించి అవగాహన కల్పించారు. టెలికామ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ రెగ్యులేషన్స్ నిబంధనలు, రిఫండ్‌లు పొందడం, బ్యాలెన్స్ బదిలీ చేయడం మరియు బిల్లింగ్ వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలనే అంశాలను వివరించారు. వినియోగదారుల సౌకర్యార్థం ట్రాయ్ ప్రవేశపెట్టిన డిఎన్ డి, మై స్వీట్, మై కాల్, చానల్స్ సెలక్టర్ వంటి యాప్‌లు మరియు పోర్టల్‌ల వినియోగాన్ని పరిచయం చేశారు. సిఐ జి వేణు మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నేరాల నియంత్రణలపై పలు సూచనలు చేశారు. కళాశాల ప్రిన్సిపల్ గంగారెడ్డి మాట్లాడుతూ శ్రీ ధరణి స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈకార్యక్రమంలో ఎస్ఐ రాజేష్, ట్రాయ్ ఆర్వో కృష్ణయ్య, ఉపాధ్యాయులు రవీందర్, సంపత్ కుమార్, అశోక్, సందీప్, రాజు, యాదయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Views: 4
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 14:39:35
దౌల్తాబాద్, సిద్దిపేట: దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొనుగోలు చేసిన రైతుల నుంచి రవాణా ఖర్చు పేరుతో బస్తాకు రూ.33 చొప్పున అదనంగా వసూలు...
