పాఠశాల ఆరోగ్యం బలోపేతం చేద్దాం
నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని రాష్ట్రీయ బాల స్వస్థ ఆరోగ్య కార్యక్రమంను జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ గారు ఈరోజు వైద్యాధికారి కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా డి ఎం హెచ్ ఓ మాట్లాడుతూ మొబైల్ హెల్త్ టీమ్లు జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు మరియు అంగన్వాడి సెంటర్లలో సంవత్సరానికి రెండుసార్లు ఆరు నెలలకు ఒకసారి పాఠశాల విద్యార్థుల ఆరోగ్యాన్ని పరీక్షించి, చికిత్స అందించి, ప్రత్యేక వైద్య సేవల కోసం అనారోగ్య విద్యార్థులను నిజామాబాద్ పట్టణంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గల డిస్టిక్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ నకు క్రమం తప్పకుండా రిఫర్ చేయాలని, రిఫర్ చేసిన విద్యార్థులను తరచూ ఏఎన్ఎంలు ఆశాలు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారుల చేత ఫాలో అప్ చేయాలన్నారు. మొబైల్ హెల్త్ టీం లో ఉన్నటువంటి సభ్యులందరికీ వైద్యాధికారి టీం లీడర్గా వ్యవహరిస్తూ ప్రతిరోజు వరి ప్రణాళిక కనుగుణంగా సమయానికి పాఠశాలలను గాని అంగన్వాడీ సెంటర్లను గాని సందర్శించి విద్యార్థులందరినీ వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందించిన తర్వాత వెళ్లాలన్నారు. ఒకవేళ ఏదైనా పాఠశాలలో బాలబాలికల సంఖ్య ఎక్కువగా ఉన్నచో రెండు రోజులు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. పాఠశాల కానీ అంగన్వాడి సెంటర్ కు కానీ వెళ్లేముందు ముందు రోజు వారికి సమాచారాన్ని అందించాలని, ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఏ వ్యాధితో బాధపడేవారు ఎంతమంది ఉన్నారు అని వారి సందర్శన రిజిస్టర్ లో నమోదు చేయాలని, రికార్డుల్లో ఎంట్రీ చేయాలన్నారు. కేవలం హైట్ వెయిట్ మాత్రమే కాకుండా బిఎంఐ క్యాలిక్యులేషన్, అబ్స్ట్రాక్ట్ కూడా వ్రాయాలన్నారు. సామ్ ,మామ్ చిల్డ్రన్స్ ను జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో ఉన్న న్యూట్రిషన్ సెంటర్ కు పంపించి 15 రోజులు ఉండి చికిత్స తీసుకునే లాగా మోటివేషన్ చేయాలన్నారు, అప్పుడు మాత్రమే పోషకాహార లోక సమస్యలు తగ్గించవచ్చు అన్నారు. క్యాన్సర్ కేసులు చికిత్స తీసుకుంటున్న వాటిని గుర్తించి డైలీ క్యాన్సర్ కేర్ సెంటర్ కు రిఫర్ చేయాలన్నారు. అనుమానిత క్యాన్సర్ కేసులు అన్నింటిని ఆశాలు ఏఎన్ఎంలు మరియు ఆర్బిఎస్కే సిబ్బంది ద్వారా డైలీ క్యాన్సర్ కేర్ సెంటర్కు ప్రిఫర్ చేయాలన్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించి విద్యార్థుల్లో ఎవరిలో అయినా అసాధారణ నడవడిక, ఒంటరితనం, ఈ కేసులు ఎక్కడుంది వ్యసనాలకు బానిస కావడం, గంజాయి టొబాకో లాంటి వాటికి అలవాటు పడడం, డ్రగ్స్ ను తీసుకోవడం లాంటి దురాలవాట్లకు బానిస అయిన వారిని గుర్తించే డిస్టిక్ మెంటల్ హెల్త్ ఆఫీసర్ కు 14416 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా సమాచారం అందించడం, సమస్యలకు పరిష్కారం జిల్లా సైకియాట్రిస్ట్ వైద్యుల చేత తెలుసుకోని చికిత్స తీసుకోవాలన్నారు. క్యాన్సర్ నోటిఫియబుల్ వ్యాధి అయినందున ప్రతి ఆశ ఏఎన్ఎం వారి సబ్ సెంటర్ పరిధిలో phc వైద్యులు వారి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో లైన్ లిస్టు ఉంచుకోవాల న్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆర్బీఎస్కే టీం ల ద్వారా విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిరంతరం చేయాలని, తద్వారా విద్యార్థుల్లో శారీరక మానసిక ఆరోగ్యం బలపడి విద్యా నైపుణ్యాలు వృద్ధి చెందుతాయన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఆర్ బి ఎస్ కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ అశోక్, జిల్లా ఉపా వైద్యాధికారులు డాక్టర్ సికందర్ నాయక్, డాక్టర్ విద్య మేడం, డాక్టర్ రవీందర్ సార్, ఎం సి హెచ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నవ్య, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవితేజ, డిస్టిక్ క్యాన్సర్ కేర్ & పాలిఏ టివ్ కేర్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ చైతన్య, డి ఈ ఐ సి మేనేజర్ సచిన్, డిప్యూటీ డెమో దుర్గారావు, డి హెచ్ ఈ ఘన్పూర్ వెంకటేశ్వర్లు వివిధ ఆర్బీఎస్కే మొబైల్ టీమ్ల వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Views: 0
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 14:39:35
దౌల్తాబాద్, సిద్దిపేట: దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొనుగోలు చేసిన రైతుల నుంచి రవాణా ఖర్చు పేరుతో బస్తాకు రూ.33 చొప్పున అదనంగా వసూలు...
