బిజెవైఏం ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాల యం ఎదుట వందేమాతారం గీతాలాపన....
- ప్రజలను చైతన్యవంతం చేసేదే వందేమాతారం గీతం.
- బీజేవై ఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ వెల్లడి..
నిజామాబాద్,: బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపుమేరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం ముందు వందేమాతర గీతాలాపన చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ..1905 బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందేమాతర గీతం ఒక రణ నినాదంగా మారి అనేకమంది ప్రజలను చైతన్యవంతం చేసినటువంటి గొప్ప నినాదం వందేమాతరం అని అన్నారు.బంకించంద్ర చటర్జీ దూర దృష్టితో వందేమా తర గీతాన్ని రచించి,స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందు కు నడిపించాడని అన్నారు.అటువంటి వందేమాతర గీతానికి 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం గా ప్రతి ఒక్క భారతీయుడు మళ్ళీ వందేమాతర గీతా న్ని మదిలో నిలుపుకొని వందేమాతరం యొక్క చరిత్ర తెలుసుకోవాలని,ఆ స్పూర్తితో ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పూర్తి వందేమాతరం అధికా రిక కార్యక్రమాల్లో పాడాలని చట్టం తీసుకోవడం జరిగిం దని స్పష్టం చేశారు.కానీ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోని యా గాంధీ ఒక వర్గానికి సంతుష్టి కరించాలని ఉద్దేశం తో పూర్తి వందేమాతర గీతాన్ని పాడకుండా అడ్డుకోవ డం సిగ్గుచేటు అని విమర్శించారు.భారత స్వాతంత్రం తీసుకురావడంలో కాంగ్రెస్ పార్టీ కృషి ఉందని చెప్పే నా యకులు,వందేమాతర గీతాన్ని ఆలపించకుండా, కొంతమంది ఓట్ల కోసం దిగుజారుడు చర్యకు పాల్పడం సిగ్గుచేటని వారు దుయ్యబడ్డారు.వందేమాతర గీతం కుల మతాలకతీతంగా ప్రతి భారతీయుడు ఆలపించా లని ఈ సందర్భంగా వారు అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేట్లు ఎర్రంసుధీర్,చిరంజీవి,శశాంక్,శ్రావణ్ , బీజేవైఎం నాయకులు విపుల్,ప్రశాంత్, రాజశేఖర్, మల్కాయ్ మహేష్, నిఖిల్ తదితరులు పాల్గొన్నారు

Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 18:45:41
పాపన్నపేట.: ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యంతో పాపన్నపేట గ్రామపంచాయతీ కారోబార్ ఆకుల కృష్ణ ప్రాణం పోయిందని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబాన్ని ఆదుకోవాలని మెదక్...
