ధర్మారెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జి రోడ్డును వెంటనే మరమ్మతు చేయాలి
బిజెపి గజ్వేల్ మండల ప్రధాన కార్యదర్శి బారు అరవింద్ డిమాండ్
గజ్వేల్/సిద్దిపేట : సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుండి చేగుంట వెళ్లే ప్రధాన రహదారిలోని ధర్మారెడ్డిపల్లి గ్రామ రైల్వే బ్రిడ్జి కింద రోడ్డు పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారిందని బిజెపి గజ్వేల్ మండల ప్రధాన కార్యదర్శి బారు అరవింద్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారెడ్డిపల్లి రైల్వే బ్రిడ్జి కింద మరోసారి భారీ గుంతలు ఏర్పడ్డాయని, సిమెంట్ కాంక్రీట్ రోడ్డు దెబ్బతిని ఇనుప రాడ్లు పైకి తేలాయని పేర్కొన్నారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ ప్రధాన మార్గంలో తేలిన ఇనుప రాడ్ల వల్ల వాహనాల టైర్లు పగిలిపోవడమే కాకుండా, ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి తీవ్ర ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని హెచ్చరించారు. గతంలో తాత్కాలిక మరమ్మతులు చేసినప్పటికీ, సరైన నాణ్యత లేకపోవడం వల్ల మళ్లీ రోడ్డు ఛిద్రమైందని విమర్శించారు. ఇప్పటికైనా రోడ్లు మరియు భవనాల శాఖ, రైల్వే శాఖల అధికారులు సమన్వయంతో తక్షణమే స్పందించి, ఎటువంటి ప్రాణనష్టం జరగకముందే యుద్ధప్రాతిపదికన బ్రిడ్జి కింద రోడ్డును శాశ్వతంగా బాగు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజల భద్రత కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
Views: 11
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 18:55:31
చౌటకూర్, : సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండల పరిధిలోని పోసానిపల్లి గ్రామపంచాయతీలో మంగళవారం రాష్ట్రస్థాయి 'జలసిరి' పనుల ప్రోగ్రాం మేనేజర్ అనురాధ పర్యటించారు. ఈ సందర్భంగా
