సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి: ఎమ్మెల్యే కడియం శ్రీహరి
సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలి
-- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) : బహుజన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ప్రతీ ఒక్కరు అయన అడుగు జాడల్లో నడవాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకొని చిల్పూర్ మండలం చిన్నపెండ్యాల గ్రామంలో పాపన్న గౌడ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి సమానత్వం కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. బడుగులను ఐక్యం చేసి, ప్రత్యేక సైన్యం ఏర్పాటు చేసుకొని గోల్కొండ కోటను జయించిన సర్దార్ పాపన్నను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. దొరలు, పెత్తందార్ల ఆదిపత్యం, అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన వీరుడని తెలిపారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిత్యం పరితపించిన యోధుని చరిత్రను ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలని వెల్లడించారు. గీతా కార్మికుల సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు చిర్ర నాగరాజు గౌడ్, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గౌడ కులస్తులు, తదితరులు పాల్గొన్నారు.
Views: 3
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 18:48:51
హనుమకొండ :"గోల్కొండ చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా వరికోల్ గ్రామంలో ఘన నివాళులు నడికూడ మండల కల్లు గీత కార్మిక సంఘం అధ్యక్షుడు...
