కళ్యాణ లక్ష్మి షాదీ ముభరక్ పథకాలను కొనసాగించాలి
డిప్యూటీ ఎమ్మార్వోకు వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ నాయకులు
కొడంగల్, :కొడంగల్ మండల కేంద్రం లో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్ పథకాలను కొనసాగించాలని డిప్యుటీ తశిల్దార్ అనితకు వినతి పత్రం అందించారు. గురువారం కొడంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముభరక్ పథకాన్ని కొనసాగించాలని డిప్యూటీ తశిల్దార్ అనిత కు వినతి పత్రం అందించారు.ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ కొడంగల్ మండల అధ్యక్షులు దామోదర్ రెడ్డి , మున్సిపల్ కౌన్సిలర్ వాణిశ్రీ మధుసూదన్ యాదవ్, ఏరన్ పల్లి శ్రీనివాస్ తెలంగాణ ఉద్యమకా రులు, మాట్లాడుతూ... పేదింటి ఆడబిడ్డల ఆత్మగౌరవానికి,ఆర్థిక భరోసా పథకాలైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత కల్పించి వెంటనే అమలు చేయాలన్నారు.2014 అక్టోబర్ 2 న మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకాన్ని కొనసాగించాలని, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆడబిడ్డలకు తులం బంగారం విషయాన్ని పక్కదారి పట్టించడానికి హైకోర్టులో కేసు వేయించి ఈ పథకాలను రద్దు చేయడం ఎంతవరకు సమంజసమని ఈ పథకాలను వెంటనే అమలు చేయాలని, లేనియెడల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ వెంకట్ రెడ్డి, డాక్టర్ నవాజ్,మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి,మల్లేష్ ముదిరాజ్,మాజీ సర్పంచ్ శివకుమార్ సింగ్, దొడ్ల రవి, రవీందర్ చారి, శేఖర్, రాజశేఖర్,శివ రాజ్,హకీమ్, రాఘవేందర్ రెడ్డి, శరణప్ప,పరమేష్, అమ్మి బాయ్, కాశమ్మ,అంజమ్మ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


