మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత
మంచినీళ్లకు బదులు 'యాసిడ్' ఇచ్చారంటు బాధితుడి కుటుంబసభ్యుల ఆందోళనలు
తప్పు కప్పిపుచ్చేందుకు ఉప్పు నీళ్లు
చికిత్స తీసుకుంటున్న చంద్రయ్య పరిస్థితి విషమం
న్యాయం చేయాలని సూపర్‌డెంట్ కార్యాలయం ముట్టడించిన కుటుంబ సభ్యులు
నల్గొండ జిల్లా,మర్రిగూడ మండలం : మర్రిగూడెం ప్రభుత్వ 30 పడకల ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఒక నిరుపేద ప్రాణం మీదికి వచ్చింది. కడుపునొప్పి, వొకరా తో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన రోగికి మంచినీళ్లకు బదులుగా ‘యాసిడ్’ ఇచ్చారంటూ బాధితుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు దిగారు.మర్రిగూడెం మండల కేంద్రానికి చెందిన కురిమిళ్ల చంద్రయ్య తీవ్ర కడుపునొప్పి,వొకరాతో స్థానిక 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ డ్యూటీలో ఉన్న వైద్యులు ఆయనను పరీక్షించి కొన్ని మాత్రలు రాశారు. ఆ టాబ్లెట్లు మింగడానికి మంచినీళ్లు కావాలని చంద్రయ్య ఆస్పత్రి సిబ్బందిని కోరగా, వారు నీళ్లకు బదులు పొరపాటున యాసిడ్ ఇచ్చారని బంధువులు ఆరోపించారు.
తప్పు కప్పిపుచ్చేందుకు ఉప్పు నీళ్లు
యాసిడ్ తాగిన వెంటనే చంద్రయ్య తీవ్రమైన మంటతో తలడిల్లాడు. ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా చూసేందుకు ఆస్పత్రి సిబ్బంది వెంటనే ఆయనతో నాలుగు బాటిళ్ల ఉప్పు నీళ్లను బలవంతంగా తాగించారని కుటుంబ సభ్యులు వాపోయారు. అనంతరం ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో కుటుంబీకులు హుటాహుటిన హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు.
ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత
సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా సోమవారం బాధితుడి కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు కలిసి సుమారు 100 మందికి పైగా ఆస్పత్రి సూపర్‌డెంట్ కార్యాలయాన్ని ముట్టడించారు.నా భర్తను చంపేస్తున్నారు, మాకు న్యాయం చేయాలి" అంటూ చంద్రయ్య భార్య రోదించిన తీరు పలువురిని కలచివేసింది.తండ్రి ప్రాణాపాయ స్థితికి ఆస్పత్రి సూపర్‌డెంటే పూర్తి బాధ్యత వహించాలని చంద్రయ్య కుమారుడు స్పష్టం చేశారు.
విచారణ జరిపాకే చర్యలు: సూపర్‌డెంట్ శంకర్ నాయక్
ఈ ఘటనపై ఆస్పత్రి సూపర్‌డెంట్ శంకర్ నాయక్ స్పందిస్తూ, ఆస్పత్రిలో ఎవరూ యాసిడ్ ఇవ్వలేదని ఆరోపణలను ఖండించారు.ప్రభుత్వ విచారణ జరుగుతోంది. విజిలెన్స్ అధికారులు వచ్చి విచారించిన తర్వాతే వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు సర్దిచెప్పి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఏది ఏమైనా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి బాధితుడికి ఉచిత వైద్యం అందించడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Views: 169
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 14:39:35
దౌల్తాబాద్, సిద్దిపేట: దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొనుగోలు చేసిన రైతుల నుంచి రవాణా ఖర్చు పేరుతో బస్తాకు రూ.33 చొప్పున అదనంగా వసూలు...
