తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం

తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ యూనియన్  రాష్ట్ర కార్యవర్గ సమావేశం

 TNGOs' కేంద్ర కార్యాలయం, నాంపల్లి హైదరాబాద్ నందు, ఎంప్లాయిస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టిఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మారం జగదీశ్వర్  మరియు టీఎన్జీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Dr. SM.హుస్సేని (ముజీబ్)  అధ్యక్షతన, నిర్వహించడం జరిగింది. 

నిజామాబాద్ :  హైదరాబాదులో జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్ జిల్లా TNGOs యూనియన్ అధ్యక్షులు శ్రీ నాశెట్టి సుమన్ కుమార్   ప్రసంగిస్తూ... క్రింది అంశాలను ప్రస్తావించారు: సమావేశ ఎజెండా అంశాలు ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకం పటిష్టంగా అమలు చేయాలని. PRC - వేతన సవరణ  అంశంపై చర్చిస్తూ... కాలతీతం అయిన 6 DA లతో కూడిన PRC ను వెంటనే అమలు అయ్యేలా ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చి అమలు ప్రక్రియ వేగవంతం చేయాలని, TNGOs జెండా & కండువా  మరియు  *ఉద్యోగుల గొంతుక*  మాస పత్రిక ఆవిష్కరణ అద్భుతమని, కొనియాడుతూ... స్వాగతిస్తున్నట్టుగా తెలిపారు సుమన్ కుమార్  ఇతర అంశాలపై మాట్లాడుతూ.... పంచాయతీ సెక్రటరీల రెగ్యులరైజేషన్ హైదరాబాద్ తోపాటు అన్ని జిల్లాల్లో త్వరతగతిన చేయుటకు ప్రభుత్వంతో చర్చించి, అమలు అయ్యేoదుకు కృషి చేయాలని,  జిల్లాలో అసంపూర్తి డాక్టర్లతో నిర్వహిస్తున్న వెల్నెస్ సెంటర్ల నిర్వహణ పటిష్టంగా ఉండేట్టు చర్యలు చేపట్టేందుకు కృషి చేయాలని,  ఉద్యోగుల సంక్షేమం, హెల్త్ కార్డులు త్వరిత గతిన అమలు, PRC అమలు మరియు CPS సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చట్టసభల్లో తీర్మానం చేసి, CPS రద్దు చేయుటకు కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని కోరారు  ఇట్టి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి టీఎన్జీవో జిల్లా కార్యదర్శి నేతికుంట శేఖర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గైని గంగారం, రాష్ట్ర కార్యదర్శి పోల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్ మరియు ఆర్మూర్ యూనిట్ అధ్యక్షులు శశాంత్ రెడ్డి హాజరైనారు
Views: 5

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News