ప్రజావాణికి 5 భూ సంబంధిత ఫిర్యాదులు

ప్రజావాణికి 5 భూ సంబంధిత ఫిర్యాదులు

మర్పల్లి, (వికారాబాద్): మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం ఐదు భూ సంబంధిత ఫిర్యాదులు అందినట్లు ఎంపీడీవో శాంతమ్మ తెలిపారు. ప్రజల సమస్యలను మండల స్థాయిలోనే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ప్రతి సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వినతులుస్వీకరిస్తారని పేర్కొన్నారు.సామాన్య ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా మండల స్థాయిలోనే అధికారులను నేరుగా కలిసి ఫిర్యాదులు అందించే అవకాశం కల్పించడమే ప్రజావాణి ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రజావాణిలో అందిన ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో శాంతమ్మ వెల్లడించారు. 
Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News