విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం
చౌటకూర్, : చౌటకూర్ మండల కేంద్రంలో విద్యుత్ తీగలకు చెట్ల కొమ్మలు తగలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో సుమారు రెండు గంటల పాటు విద్యుత్ లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.విద్యుత్ తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను తొలగించాలని పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ, చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారని స్థానికులు తెలిపారు. ముందస్తుగా చెట్ల కొమ్మలను తొలగించి విద్యుత్ అంతరాయాలు లేకుండా చూడాలని వారు విద్యుత్ శాఖ అధికారులను కోరుతున్నారు.
Views: 1
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 14:39:35
దౌల్తాబాద్, సిద్దిపేట: దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొనుగోలు చేసిన రైతుల నుంచి రవాణా ఖర్చు పేరుతో బస్తాకు రూ.33 చొప్పున అదనంగా వసూలు...
