సిరిసిల్ల పెద్దూరులో ఘోర అగ్నిప్రమాదం..
ఒకరు సజీవ దహనం
- ఫర్నిచర్ షాప్‌లో నిద్రిస్తున్న నలుగురు కూలీలు.. ముగ్గురు సురక్షితం
- రూ.40–45 లక్షల ఆస్తి నష్టం.. ఘటనపై పోలీసుల దర్యాప్తు
రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల పెద్దూరులోని మహాలక్ష్మి ఫర్నిచర్ షాప్ అండ్ గోదాంలో మంగళవారం ఉదయం అకస్మాత్తుగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన కూలీ మహమ్మద్ ఇస్లాం సజీవ దహనమయ్యాడు. షాపులో నిద్రిస్తున్న నలుగురు కూలీల్లో ముగ్గురు సురక్షితంగా బయటపడగా, మహమ్మద్ ఇస్లాం మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. అగ్నిప్రమాదంలో ఫర్నిచర్ షాప్, గోదాంలోని సామగ్రి పూర్తిగా దగ్ధమై సుమారు రూ.40 నుంచి రూ.45 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు షాప్ యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు చేసి, లోన్లు తీసుకుని షాప్ నిర్వహిస్తున్నానని, ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిస్థితిని సమీక్షించారు. జిల్లా ఎస్పీ మహేష్ బి. గీతే ఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా? లేక ఎవరైనా కావాలనే నిప్పు పెట్టారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Views: 35
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
18 Aug 2026 14:39:35
దౌల్తాబాద్, సిద్దిపేట: దౌల్తాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో యూరియా కొనుగోలు చేసిన రైతుల నుంచి రవాణా ఖర్చు పేరుతో బస్తాకు రూ.33 చొప్పున అదనంగా వసూలు...
