లెప్రసీ రహిత సమాజం కోసం సమష్టి కృషి
- శివంపేట పీహెచ్‌సీలో లెప్రసీ కేసుల రికార్డుల పరిశీలన
- వ్యాధిగ్రస్తులను త్వరగా గుర్తించి సకాలంలో చికిత్స అందించాలి
శివంపేట, (మెదక్): శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లెప్రసీ వ్యాధికి సంబంధించిన శాంపిల్ సర్వే, కేసుల రికార్డులు, నివేదికల పరిశీలన కార్యక్రమం నిర్వహించారు. లెప్రసీ శాంపిల్ సర్వే అధికారి డాక్టర్ సంపత్, ఉప జిల్లా వైద్యాధికారి డాక్టర్ సృజన, వారి కార్యాలయ సిబ్బంది, స్థానిక వైద్యాధికారి డాక్టర్ సాయి సౌమ్య, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వెంకటేశ్వరచారి, శ్రీనివాస్, సంతోష్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీ పరిధిలో నమోదైన లెప్రసీ కేసులకు సంబంధించిన రికార్డులు, నివేదికలను అధికారులు పరిశీలించారు. అనంతరం వైద్య, ఆరోగ్య సిబ్బందితో సమావేశం నిర్వహించి లెప్రసీ వ్యాధి గుర్తింపు, వ్యాధిగ్రస్తులకు అందించాల్సిన చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. లెప్రసీ కేసులను సాధ్యమైనంత త్వరగా గుర్తించి సకాలంలో చికిత్స అందించడం ద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించాలని అధికారులు సూచించారు. లెప్రసీ రహిత సమాజ నిర్మాణానికి వైద్య, ఆరోగ్య సిబ్బంది సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం శివంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సిబ్బంది ధనాగౌడ్, రాజయ్య, అనిత, శ్రీనివాస్, ఇందిరా, దేవరాజ్‌తో పాటు ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


