బీసీల జనాభా లెక్క తేల్చాల్సిందే..

జాతీయ బీసీ సంఘం జిల్లా ఇన్‌చార్జి విజయగిరి సమ్మయ్య డిమాండ్

బీసీల జనాభా లెక్క తేల్చాల్సిందే..

కాటారం (భూపాలపల్లి): దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో బీసీలకు ప్రత్యేక కాలమ్ ఏర్పాటు చేసి, ప్రతి కులానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయిం చి కచ్చితమైన జనాభా లెక్కలు నమోదు చేయాలని జాతీయ బీసీ సంఘం భూపాలపల్లి జిల్లా ఇన్‌చార్జి విజయగిరి సమ్మయ్య డిమాండ్ చేశారు. బీసీల జనాభా, కులాల వారీ సంఖ్యతో పాటు వారి సామాజిక, ఆర్థిక, విద్యా పరిస్థితులపై సమగ్ర వివరాలు సేకరించాల్సిన అవసరం ఉందన్నారు. కచ్చితమైన గణాంకాలు లేకుండా జనాభా ప్రాతిపదికన సంక్షేమ పథకాలు, విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించడం సాధ్యం కాదన్నారు.బీసీ జనాభాపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో చర్చించి ప్రత్యేక తీర్మానం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కేంద్రం వెంటనే ఆమోదించాలని, లేదంటే కేంద్ర ప్రభుత్వంపై బీసీల ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. “మా వాటా మాకే దక్కాలి” అని విజయగిరి సమ్మయ్య స్పష్టం చేశారు.

Views: 0

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget