కొత్తగూడెం ఏరియా జీఎం శాలెం రాజుకు ఘన సన్మానం
కొత్తగూడెం, : సింగరేణి సంస్థ కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తూ ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న శాలెం రాజును ఏరియా వర్క్‌షాప్‌లో అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఏరియా వర్క్‌షాప్‌లో డీజీఎం జొన్నలగడ్డ క్రిస్టఫర్ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో శాలెం రాజు సేవలను కొనియాడారు. సింగరేణిలో అండర్ మేనేజర్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, అంచెలంచెలుగా ఎదుగుతూ జనరల్ మేనేజర్ స్థాయికి చేరుకుని పదవీ విరమణ చేయడం ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచిందని వక్తలు పేర్కొన్నారు. కొత్తగూడెంలోనే జన్మించి, విద్యాభ్యాసం పూర్తి చేసి, అదే ప్రాంతంలో ఉద్యోగంలో చేరి, చివరకు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్‌గా పదవీ విరమణ చేస్తున్న తొలి అధికారిగా శాలెం రాజు నిలిచారని వారు తెలిపారు. ఉద్యోగ జీవితంలో పలు ప్రాజెక్టులను సమర్థవంతంగా నిర్వహించి సహోద్యోగుల ప్రశంసలు అందుకున్నారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శాలెం రాజు మాట్లాడుతూ, సింగరేణి సంస్థ అభివృద్ధికి ప్రతి ఉద్యోగి సమిష్టి కృషి అవసరమన్నారు. ఉద్యోగులు నీతి, నిజాయితీ, నిబద్ధతతో తమ బాధ్యతలను నిర్వర్తిస్తే సంస్థ మరింత పురోగతి సాధిస్తుందని చెప్పారు. సంస్థ అభివృద్ధి ఉద్యోగుల అంకితభావంపైనే ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎం.డి. రజాక్ మాట్లాడుతూ శాలెం రాజు ఉద్యోగ జీవితాన్ని అభినందిస్తూ, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏజీఎం రామకృష్ణ, ఎస్‌వోటీయూ జీఎం గోవిందరావు, వర్క్‌షాప్ ఇంజినీర్లు బి. శంకర్, టి. అనిల్, ఏ. ఉపేందర్ బాబు, రవికుమార్, ఐఎన్‌టీయూసీ ఫిట్ కార్యదర్శి ఎం.డి. సత్తార్ పాషా, ఏఐటీయూసీ ఫిట్ కార్యదర్శి మధుకృష్ణ, బ్రాంచ్ సెక్రటరీ మెంగని అశోక్, సూపర్‌వైజర్లు బి. వెంకట్రాం, యు. రమేష్ బాబు, రోషన్, తారాచంద్, ఎస్.డి. యాకుబుద్దీన్, కరుణాకర్, జాన్ కెనడీ, వెంకట దుర్గతో పాటు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.
Views: 105
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
