ఇళ్ల స్థలాల కోసం పోరాడాలి

ఇళ్ల స్థలాల కోసం పోరాడాలి

హన్మకొండ  : పేదలుఇల్లు స్థలాల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని  భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సిపిఎం హనుమకొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం చుక్కయ్య బొట్ల చక్రపాణి అన్నారు. సోమవారం హనుమకొండ రాంనగర్ లోని సుందరయ్య భవన్ లో  హనుమకొండ సౌత్ మండల కమిటీ జనరల్ బాడీ సమావేశం పార్టీ మండల కమిటీ సభ్యుడు ఇస్లావత్ రవీందర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కయ్య బొట్ల చక్రపాణి హాజరై మాట్లాడుతూ.. హనుమకొండ సౌత్ మండల కమిటీ ఆధ్వర్యంలో పిఎఫ్ ఆఫీస్, కోట చెరువు, రాజు హోటల్, వెనకాల పేదలు గత నాలుగు సంవత్సరాలుగా గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని అన్నారు. వారికి ప్రభుత్వం ఇంటి పట్టాలు ఇచ్చి అందులోనే  ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.గుడిసె వాసులు సరైన మౌలిక వసతులు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నా రన్నారు. నగరంలో ఇంటి కిరాయీలు కట్టలేక ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని ఉన్నపేదల నువేధిస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తామని గొప్పలు చెబుతుందని కానీ ఆచరణలో గుడిసె వాసులకు ఇంటి స్థలాలు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం లేదన్నారు. ప్రభుత్వానికి పేదల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వారు నివసిస్తున్న గుడిసెలకు పట్టాలు ఇచ్చి అదే స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హనుమకొండ సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ మాట్లాడుతూ  దీన్ దయాల్, నగర్ నాగేంద్ర నగర్, కోట చెరువు కారులు మార్క్స్ కాలనీ, భగత్ సింగ్ నగర్, కాలనీలలో ప్రజలకి చెరువు శిఖరం జీవో కన్వర్షన్ చేసి రెగ్యులరైజేషన్ పట్టాలు ఇవ్వాలని ఇంతకుముందు అధికారంలో ఉన్న టిఆర్ఎస్ ప్రభుత్వం 58 జీవో ప్రకారం కొన్ని ప్రాంతాలకు గుడిసెవాసులకి పట్టాలు పంపిణీ చేసి ఉన్నదని మిగతా గుడిసె వాసులకి పెండింగ్ లో ఉన్న పట్టాలని మంజూరు చేయాలని అన్నారు. లేనిపక్షంలో రానున్న ఎన్నికల్లో గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టిన గతి పడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ సౌత్ మండల కమిటీ సభ్యులు చెరిపెల్లి కుమారస్వామి, పొట్లపల్లి రాజు, నకరకంటి సుకర్ణ, యజ్ఞం స్రవంతి, సప్పిడి మనోహర్, జగనాల ఉప్పలయ్య,తుపాకుల సుధాకర్, సముద్రాల అనిల్, రేణిగుంట్లచందర్ , నేతకాని భారతి,రజియా, దూడపాక రాజేందర్ , వంగాల రవీందర్, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులు, చిలుక జంపన్న, నరేష్ ,కుమ్మరి రవీందర్ ,కుమార్ సమ్మయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
 
Views: 10

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News