ఘనంగా జాతీయ సేవా పథక దినోత్సవ సంబరాలు
గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం ప్రభాకర్ గారి అధ్యక్షతన గురువారం కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పాక ధర్మపురి ఆధ్వర్యంలో పలు సేవ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది మొదట కళాశాల ఆవరణంలో ఉన్న పిచ్చి మొక్కలను కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం మరియు విద్యార్థులు అందరూ కలిసి పారలతో తొలగించి శుభ్రం చేశారు అనంతరం గంభీరావుపేట మండల కేంద్రంలో ఉన్న ' మా 'అనాధ వృద్ధాశ్రమం దర్శించి వృద్ధులకు అరటి పండ్లు బిస్కెట్ ప్యాకెట్లు అధ్యాపకులు మరియు విద్యార్థుల చేత పంపిణీ చేయబడ్డాయి. ఇట్టి కార్యక్రమంలో కళాశాల ఐ క్యు ఎ సి కోఆర్డినేటర్ డాక్టర్. వై. ఆంజనేయులు, టాస్క్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. శ్రావణ్, స్కాలర్షిప్ కోఆర్డినేటర్ డాక్టర్. ఎన్. ఆదివిష్ణువు, డబ్ల్యూ ఈ సి కోఆర్డినేటర్ వి. వాణి, డాక్టర్ కె.వి. బిక్షమయ్య,మనోహర్, శ్రీనివాస్, సూచరణ్, కృష్ణ ప్రసాద్, మహేష్, శంకర్ ,ఆఖల్య తదితర అధ్యాపకులు అధ్యాపకేతర బృందం విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


