జాతీయ స్థాయిలో నాలుగు రజత పతకాలు

జాతీయ స్థాయిలో నాలుగు రజత పతకాలు

భద్రాచలం, : వయస్సు కేవలం సంఖ్య మాత్రమేనని మరోసారి నిరూపిస్తూ భద్రాచలానికి చెందిన రిటైర్డ్ ఎస్‌బీఐ అధికారి, పవర్‌లిఫ్టర్ డి.వి. శంకరరావు జాతీయ స్థాయిలో నాలుగు రజత పతకాలు సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) గార్ఖేడా స్టేడియంలో నిర్వహిస్తున్న నేషనల్ మాస్టర్స్ క్లాసిక్ & ఎక్విప్డ్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్–2026లో పాల్గొన్న శంకరరావు, జూలై 20న జరిగిన పోటీల్లో మూడు వ్యక్తిగత విభాగాల్లో రజత పతకాలు, ఓవరాల్ ఛాంపియన్‌షిప్‌లో మరో రజత పతకం సాధించి మొత్తం నాలుగు రజత పతకాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో దేశంలో ద్వితీయ స్థానంలో నిలిచి భద్రాచలం కీర్తిని జాతీయ స్థాయిలో చాటారు.ఇది ఆయన వరుసగా మూడో జాతీయ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్. గతంలో కేరళలోని కోజికోడ్, హర్యానాలోని ఫరీదాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లోనూ పతకాలు సాధించిన శంకరరావు, ఇప్పుడు ఔరంగాబాద్‌లో కూడా తన విజయ పరంపరను కొనసాగించారు.భద్రాచలంలోని సిటీ స్టైల్ జిమ్లో ప్రముఖ కోచ్ జి.వి. రామిరెడ్డి పర్యవేక్షణలో 73 ఏళ్ల శంకరరావు క్రమం తప్పకుండా శిక్షణ పొందుతున్నారు. ఈ సందర్భంగా కోచ్ రామిరెడ్డి మాట్లాడుతూ, శంకరరావు గారి క్రమశిక్షణ, అంకితభావం, పట్టుదల యువతకు ఆదర్శమని, జాతీయ స్థాయిలో నాలుగు రజత పతకాలు సాధించడం ఆయన నిరంతర శ్రమకు నిదర్శనమని ప్రశంసించారు.ఈ విజయానికి కారణమైన కోచ్ జి.వి. రామిరెడ్డి, కుటుంబ సభ్యులు, మద్దతుదారులందరికీ శంకరరావు కృతజ్ఞతలు తెలిపారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశానికి మరిన్ని పతకాలు సాధించడం తన తదుపరి లక్ష్యమని పేర్కొన్నారు.జాతీయ స్థాయిలో విశిష్ట విజయాన్ని సాధించిన శంకరరావును పట్టణ ప్రముఖులు, పలువురు రాజకీయ నాయకులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, పవర్‌లిఫ్టింగ్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి. మల్లేష్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు భోగాల శ్రీనివాస్ రెడ్డి, గ్రీన్ భద్రాద్రి సభ్యులు, సిటీ స్టైల్ జిమ్ సభ్యులు అభినందించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ రిఫరీ అనంత్ చాల్కేతో కలిసి విజేత శంకరరావు, ఇతర పవర్‌లిఫ్టింగ్ అధికారులు పాల్గొన్నారు.
Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్థివ దేహానికి నివాళులర్పించిన -మాజీ తొలి ఉప ముఖ్యమంత్రి రాజయ్య
లింగాల గణపురం (జనగామ):  కళ్ళెం గ్రామంలోని బిఆర్ఎస్ పార్టీ మాజీ గ్రామ శాఖ అధ్యక్షుడు, పార్టీ సీనియర్ నాయకులు మబ్బు ఆదాం  తల్లి మరణించగా తెలంగాణ రాష్ట్ర...
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని
రూ.35లక్షల అవినీతిపై విచారణ చేయండి
గద్దె రాగడి ఇంట్లో దొంగతనం
శ్రీ కనక దుర్గమ్మ ఎగ్జిబిషన్ ప్రారంభం
ఆర్టీసీ బస్సు కండక్టర్ నిజాయితీ..!
ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి