బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు

బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు

కొత్తగూడెం :  తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్‌కు మైనింగ్ లీజు మంజూరు కావడం సందర్భంగా సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో శనివారం విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలెమ్ రాజు ముఖ్య అతిథిగా హాజరై ఉద్యోగులకు అభినందనలు తెలిపారు. తాడిచర్ల–2 బ్లాక్ సాధన సింగరేణి సంస్థ భవిష్యత్తుకు కీలక మైలురాయిగా నిలుస్తుందని, సంస్థ అభివృద్ధి, కార్మికుల సంక్షేమం కోసం ప్రతి ఉద్యోగి సమిష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జీఎం కార్యాలయంతో పాటు అన్ని గనులు, విభాగాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించి ఉద్యోగులకు స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సందేశంతో కూడిన కరపత్రాలను పంపిణీ చేసి, తాడిచర్ల–2 బొగ్గు బ్లాక్ మైనింగ్ లీజుతో సింగరేణికి సుస్థిర భవిష్యత్తు లభించిందని వివరించారు. అలాగే కొత్త బొగ్గు గనుల సాధన, ఉత్పత్తి వ్యయ నియంత్రణ, సాంకేతిక అభివృద్ధి, పునరుత్పాదక ఇంధన రంగంలో విస్తరణ వంటి అంశాలపై ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం అధికారులు, ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. కొత్తగూడెం ఏరియాలోని అన్ని గనులు, విభాగాల్లో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. కార్యక్రమంలో వికెసీఎం ప్రాజెక్టు అధికారి ఎంవీ నరసింహరావు, ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్ రావు, ఐఎన్‌టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండీ రజాక్, ఎస్వోటు జీఎం ఎం. గోవిందరావు, పర్సనల్ మేనేజర్ ఎల్. తిరుపతి, ఏరియా ఇంజినీర్ వి. రామకృష్ణ, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ మొక్కపాటి వెంకటేశ్వర్లు, డీజీఎం (ఐఈడీ) యోహన్, ఇన్‌చార్జ్ హెచ్‌వోడీ (సివిల్) కె. రాజారాం, డివైపీఎం హరీష్, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ కార్మిక సంఘాల నాయకులు, అధికారులు, సూపర్వైజర్లు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ
ప్రభుత్వ హాస్పిటళ్ల పనితీరు మెరుగుపడిందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తుండడంతో, ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చే సంఖ్య కూడా పెరుగుతోందని మంత్రి...
ఆహార, ఔషధాల్లో కల్తీల నిరోధానికి కఠిన చట్టం-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
నాణ్యమైన విద్య, క్రమశిక్షణకు చిరునామా కేజీబీవీ 
శుభ్రతతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం
దౌల్తాబాద్ తాండాలో డెంగ్యూపై అప్రమత్తత చర్యలు
కొనాయిపల్లిలో ఘనంగా అక్షరాభ్యాసం కార్యక్రమం
19న జిల్లాస్థాయి తైక్వాండో ఛాంపియన్ సిప్ పోటీలు