పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
ములుగు/ మంగపేట : బీఆర్ఎస్ పార్టీ ములుగు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ జడ్పీ చైర్మన్ బడే నాగజ్యోతి ఆదేశాల మేరకు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ మంగపేట మండల మాజీ అధ్యక్షుడు కుడు ముల లక్ష్మి నారాయణ ఆధ్వర్యంలో మల్లూరు శ్రీ హేమచల లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన సుదర్శన్ రెడ్డి త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని నాయకులు స్వామివారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు గుండేటి రాజుయాదవ్, నూతిలకంటి ముకుందం, భవాని, కేక్కం జగదీష్, గుడివాడ శ్రీహరి, సందీప్, గౌరి శంకర్, అజ్జు, రాంప్రకాష్, సోహెల్ తదితరులు పాల్గొన్నారు.
Views: 28
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
27 Jul 2026 20:44:32
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై రాష్ట్ర శక్తి (కార్మిక, ఉపాధి, శిక్షణ & ఫ్యాక్టరీలు) మరియు గనుల శాఖ మంత్రి డా....
