మాతృ ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలి: పీఓ ఎంహెచ్‌ఎన్ డా. శ్రీదేవి

మాతృ ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలి: పీఓ ఎంహెచ్‌ఎన్ డా. శ్రీదేవి

కాటారం (భూపాలపల్లి) :  మాతృ ఆరోగ్య సేవలను మెరుగుపర్చాలని భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ  పీఓ ఎంహెచ్‌ఎన్ డా. శ్రీదేవి సూచించారు. కాటారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) సందర్శించి మాతృ ఆరోగ్య సేవల అమలును సమీక్షించారు. గర్భిణీలకు అందుతున్న సేవలు, ఏఎన్‌సీ నమోదు, వైద్య పరీక్షలు, పోషకాహార కార్యక్రమాల అమలుపై ఆరోగ్య సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. గర్భిణీలందరూ గర్భధారణ 12 వారాల్లోపు తప్పనిసరిగా ఏఎన్‌సీ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. హైరిస్క్ గర్భిణీలను ప్రారంభ దశలోనే గుర్తించి, వారికి ప్రత్యేక వైద్య పర్యవేక్షణ, అవసరమైన చికిత్సతో పాటు సకాలంలో రిఫరల్ సేవలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ప్రతి గర్భిణీకి క్రమం తప్పకుండా ఏఎన్‌సీ పరీక్షలు, అవసరమైన ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని, ఐరన్–ఫోలిక్ యాసిడ్ మాత్రలను నిరంతరం అందిస్తూ వాటి వినియోగాన్ని పర్యవేక్షించాలని సూచించారు. గర్భిణీలకు సమతుల్య పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. తల్లి, శిశువు ఆరోగ్య పరిరక్షణలో ప్రతి ఆరోగ్య కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని పేర్కొన్నారు. వర్షాకాలం నేపథ్యంలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి కాలానుగుణ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గ్రామాల్లో నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టాలని, జ్వరం లక్షణాలు ఉన్నవారికి వెంటనే పరీక్షలు నిర్వహించి చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రజల్లో వ్యాధుల నివారణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పీహెచ్‌సీలోని వివిధ విభాగాలను పరిశీలించిన డా. శ్రీదేవి, ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను నాణ్యతతో అమలు చేసి గర్భిణీలు, బాలింతలకు మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్యాధికారి డా. మౌనిక, డా. హారిక, ల్యాబ్ టెక్నీషియన్ పుష్పలత, హెచ్‌వీ సరళ, సిబ్బంది ఫార్మాసిస్ట్ నవీన్, మెర్సీ రాణి, ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు.
 
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News