మాజీ మంత్రి హరీష్ రావుకి మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ రాఖీ కట్టిన కౌన్సిలర్ వాల సుప్రజా నవీన్
హుస్నాబాద్ సిద్దిపేట : హుస్నాబాద్ లోని 18 వ వార్డు కౌన్సిలర్ వాల సుప్రజానవీన్ రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీమంత్రి తన్నీరు హరీష్ రావుకి,మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్ లకు రాఖీలు కట్టి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా మహిళా కౌన్సిలర్ సుప్రజతో హరీష్ రావు,సతీష్ కుమార్ ఆప్యాయంగా ముచ్చటిస్తూ,వారిని పలకరించి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం స్వీట్లు తినిపించి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు.రాఖీ పౌర్ణమి అన్నాచెల్లెళ్ల, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధానికి ప్రతీక అని అన్నారు. మహిళల భద్రత, గౌరవం,ఈ పండుగ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.రాఖీ పౌర్ణమి సందర్భంగా ప్రతి కుటుంబంలో సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


