చదువుతోనే పేదల తలరాతలు మారుతాయి
- కాంగ్రెస్ మర్రిగూడ మండల నాయకులు మాతంగి నవీన్
- ఖుదాభక్ష్ పల్లి జెడ్పీహెచ్‌ఎస్ పదవ తరగతి టాపర్లకు సత్కారం, నగదు బహుమతులు ప్రదానం
- క్రీడాకారులకు ఉచితంగా టీ-షర్టులు అందజేత
- 100% ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేక అభినందనలు
నల్గొండ : మర్రిగూడ మండలం: చదువు మాత్రమే పేదరికాన్ని జయించి జీవితాల్లో వెలుగులు నింపగలదని, ఎన్ని కష్టాలు ఎదురైనా విద్యార్థులు చదువును ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని కాంగ్రెస్ పార్టీ మర్రిగూడ మండల నాయకులు మాతంగి నవీన్ పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని మార్చే అతిపెద్ద శక్తివంతమైన ఆయుధం విద్య ఒక్కటేనని ఆయన ఉద్ఘాటించారు.మర్రిగూడ మండలంలోని ఖుదాభక్ష్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2025-26 విద్యాసంవత్సరానికి గాను పదవ తరగతి ఫలితాల్లో మండల స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి గ్రామానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన విద్యార్థులకు సోమవారం సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. పాఠశాల స్థాయిలో అత్యుత్తమ మార్కులతో స్కూల్ టాపర్‌గా నిలిచిన మాదగోని మణికంఠకు రూ. 5,000 సెకండ్ టాపర్‌గా నిలిచిన ఆంబోత్ దీపికకు రూ. 3,000 నగదు ప్రోత్సాహక బహుమతులతో పాటు శాలువాలు కప్పి మాతంగి నవీన్ స్వయంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా దేవాలయాలని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత సమాజంలో అందరిపై ఉందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి, కన్నతల్లులకు, విద్య నేర్పిన ఉపాధ్యాయులకు, పుట్టిన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల ఉన్నతికి, విద్యాభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు.
క్రీడాకారులకు ప్రోత్సాహం:
పాఠశాలకు చెందిన వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు మాతంగి నవీన్ వారి కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన టీ-షర్టులను ఉచితంగా పంపిణీ చేశారు. క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించాలని కోరారు.
ఉపాధ్యాయులకు అభినందనలు:
2025-26 విద్యాసంవత్సరంలో పదవ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించి పాఠశాల కీర్తిని చాటిన ప్రధానోపాధ్యాయురాలు రామతులసి మేడమ్‌ను, ఉపాధ్యాయ బృందాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులను క్రమశిక్షణతో తీర్చిదిద్దుతున్న వారి కృషిని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం రామతులసి, ఉపాధ్యాయ బృందం, వార్డ్ మెంబెర్ గండు సత్తయ్య, గ్రామ నాయకులు, యువకులు రమావత్ పాండు, రాపోతు గణేష్, కారింగు నర్సింహా, పోలె మహేష్, గోల్కొండ రాజు, విద్యార్థులు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Views: 101
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
17 Aug 2026 15:55:24
క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి
గండిపేట తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి సమీక్ష
