మేలకుంట శిఖం ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలి

మేలకుంట శిఖం ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలి

కరీంనగర్, : కరీంనగర్ సీతారాంపూర్ శివారులోని ‘మేలకుంట శిఖం’ ప్రభుత్వ భూమిలో జరుగుతున్న అక్రమ కబ్జాలు, నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న నిర్మాణాలను కరీంనగర్ నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక పర్యవేక్షకురాలు స్రవంతి, అధికారి కుమార్ మరియు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు శిఖంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన కట్టడాలను వెంటనే కూల్చివేయాలని, ప్రస్తుతం జరుగుతున్న నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని పట్టణ ప్రణాళిక అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ మాట్లాడుతూ సీతారాంపూర్ శివారులోని సర్వే నెం. 71, 72లో ఉన్న 13 ఎకరాల 26 గుంటల మేలకుంట శిఖం ప్రభుత్వ భూమి భారీగా కబ్జాకు గురైందని అన్నారు. నీటిపారుదల శాఖ నుండి ఎలాంటి అనుమతి పత్రం లేకపోయినా నగరపాలక సంస్థ అధికారులు అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఎలా ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.చెరువు శిఖంలోనే రోడ్డు ఉన్నట్లు చూపిస్తూ ప్రైవేట్ భవనాలు, అపార్ట్మెంట్లు, విద్యాసంస్థలు, వివాహ మందిరాలు నిర్మిస్తుంటే అధికారులు పట్టించుకోవడం లేదా అని ప్రశ్నించారు. గతంలో 22-12-2023న ఉప సర్వేయర్ ఆధ్వర్యంలో కొత్తపల్లి, చొప్పదండి, కరీంనగర్ గ్రామీణ సర్వేయర్ల బృందం పరిశీలించి దాదాపు 40 మందికి పైగా అక్రమార్కులు ఇక్కడ నివాసాలు, అడుగు భాగాలు నిర్మించినట్లు ప్రభుత్వ నివేదికలో పేర్కొందని గుర్తు చేశారు. రెవెన్యూ అధికారులే ఇవి అక్రమ కట్టడాలని తేల్చినా ఇప్పటివరకు కూల్చివేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారుచెరువులు, కాలువలు కబ్జాకు గురికావడంతో కొద్దిగా వర్షం పడినా ఆర్టీసి వర్క్‌షాప్ దగ్గర సూర్యనగర్ కాలనీ పూర్తిగా నీట మునుగుతోందని, కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారి చెరువులా మారి వాహనాలను మళ్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారుఉన్నతాధికారులు వెంటనే స్పందించి మేలకుంట శిఖంలో ప్రస్తుతం జరుగుతున్న అపార్ట్మెంట్లు, ఇతర భవనాల నిర్మాణాలను ఆపాలని, అక్రమ కట్టడాలను నిష్పాక్షికంగా కూల్చివేసి మేలకుంట చెరువు, విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని డిమాండ్ చేశారు.
Views: 16

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News