కాంగ్రెస్‌లో కదలిక కరువు..!

కాంగ్రెస్‌లో కదలిక కరువు..!

  • రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్‌కు నిరసనకు కౌన్సిలర్ల డుమ్మా..
  • నల్ల బ్యాడ్జీల నిరసనకు పలువురు నాయకులు దూరం..
  • అధికార పార్టీ సమావేశాలకు 20 మంది కూడా రాని వైనం..
  • పార్టీ కార్యక్రమాలపై నాయకుల్లో ఆసక్తి కరువైందా..?
  • కాంగ్రెస్‌లో సమన్వయ లోపం స్పష్టమవుతోందా..?

సూర్యాపేట  సూర్యాపేట జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీలో నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడిందా అనే చర్చకు తాజా పరిణామాలు బలం చేకూరుస్తున్నాయి. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై దురుద్దేశ పూర్వకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ఆరోపిస్తూ మంగళవారం సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం (రెడ్ హౌస్) వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం నిర్వహించగా, పలువురు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.ఇదిలా ఉండగా, అధికార పార్టీ నిర్వహించే సమావేశాలకు సైతం 20 మంది నాయకులు, కార్యకర్తలు కూడా హాజరు కాని పరిస్థితి నెలకొనడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది. పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలకు పిలుపునిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఆశించిన స్థాయిలో స్పందన కనిపించకపోవడం నాయకత్వానికి సవాలుగా మారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాలకు నాయకులు, ప్రజాప్రతినిధులు గైర్హాజరు కావడానికి కారణాలేమిటన్నది ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ నాయకత్వం దీనిపై దృష్టి సారించి, నాయకులు,కార్యకర్తల మధ్య సమన్వయం పెంచాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Views: 269

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News