శివంపేటలో రూ.1 కోటి అభివృద్ధి పనులకు శ్రీకారం
చౌటకూర్, : చౌటకూర్ మండలంలోని శివంపేట గ్రామంలో హెచ్‌ఎండీఏ నిధులతో రూ.1 కోటి వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. ఈ నిధులతో గ్రామంలో సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులను ప్రారంభించారు.గ్రామంలో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య పరిస్థితుల మెరుగుదల, రవాణా సౌకర్యాల అభివృద్ధి లక్ష్యంగా ఈ పనులు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ అభివృద్ధి పనులు పూర్తయితే గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నత్తిక దశరథ్, సర్పంచ్ సంధ్య మల్లికార్జున్ గౌడ్, ఉపసర్పంచ్ నత్తి సందీప్ కుమార్, గ్రామ కార్యదర్శి వేణుగోపాల్, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Views: 64
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
