ట్రాఫిక్ తనిఖీలు 519 కేసులు, ₹4.09 లక్షల జరిమానా
మహబూబ్‌నగర్: జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 19 జూలై నుండి 25 జూలై 2026 వరకు వారం రోజుల పాటు ప్రత్యేక ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులపై మోటారు వాహనాల చట్టం ప్రకారం మొత్తం *519 కేసులు* నమోదు చేసి *₹4,09,000/-* జరిమానా విధించారు.ఈ వారంలో 6 అవగాహన, కౌన్సెలింగ్ కార్యక్రమాలు కూడా నిర్వహించి రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, "ప్రతి వాహనదారుడు హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలి. మద్యం సేవించి, మొబైల్ మాట్లాడుతూ వాహనం నడపవద్దు. ట్రాఫిక్ నిబంధనలు మీ భద్రత కోసమే. బాధ్యతాయుతంగా వ్యవహరించి సురక్షితంగా ప్రయాణించాలి" అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Views: 171
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
