పాండురంగశ్రమంలో ఘనంగా తొలి ఏకాదశి ఉత్సవాలు
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి మొదలైంది.మధ్యాహ్నానికి క్రమంగా పెరుగుతూ ఆశ్రమం భక్తజన సంద్రాన్ని తలపిస్తోంది.ప్రధాన ఆలయ మంటపంలో భజనల్లో మునిగిపోయి భక్తులు మైమరిచిపోతున్నారు.మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాలు విరివిగా సాగుతున్నాయి.ఈ సందర్భంగా ఉదయం నుంచి భక్తులకు నిరంతరం ఫలహారం,తేనేటి సేవలను నిర్వాహకులు అందుబాటులో ఉంచారు.సుదూరం నుంచి ఏర్పాటు చేసిన క్యూ లైన్ లలో నిల్చని ఓపిగ్గా భక్తులు పాండురంగడి దర్శనాలు చేసుకుంటున్నారు.తొలి ఏకాదశి సందర్బంగా దేవదాయశాఖ కమిషనర్ హనుమంతరావు ,సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి,పి ఆర్ టి యు అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి,జగిత్యాల జిల్లా రెండో అదనపు సివిల్ జడ్జి నిఖిషా, మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి తదితరులు హాజరై పాండురంగ స్వామిని దర్శించుకున్నారు. ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు తొలుత గురుదేవుల నిరాజనామృతం,చుంచనకోట లలితామతి శర్మ ఆధ్వర్యంలో చక్రిభజన,చిన్నారులు సంహిత,అభిజ్ఞ నృత్య ప్రదర్శన,కొడకండ్ల రాధాకృష్ణశర్మ నీరాజన సేవ,తిగుళ్ల వాసుదేవ శర్మ భవానంద స్వామి కథాగానం భక్తజనులను ఆకట్టుకున్నాయి.
Views: 48
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
