ప్రత్యామ్నాయ పంటల సాగుతో నష్టాలను తగ్గించుకోవాలి
దౌల్తాబాద్(సిద్ధిపేట్); వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులు సాగు ప్రణాళికలు రూపొందించుకోవాలని, ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని మాచిన్ పల్లి సర్పంచ్ బొక్కల నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన గ్రామ సభలో ఎల్‌నినో వాతావరణ పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రైతులు సంప్రదాయ పంటలతో పాటు తక్కువ నీటితో సాగుచేయగల పంటలను ఎంచుకోవాలని, వ్యవసాయ శాఖ అధికారులు గ్రామస్థాయిలో రైతులకు సకాలంలో సలహాలు అందించాలని మంత్రి సూచించారు. ప్రకృతి పరిస్థితులను ముందుగానే అంచనా వేసుకుని సాగు ప్రణాళికలు రూపొందించుకుంటే నష్టాలను తగ్గించుకోవచ్చన్నారు. వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని జొన్న, సజ్జ, పెసర, మినుము, కంది వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. పంటల బీమా, నేల పరీక్షలు, నాణ్యమైన విత్తనాల వినియోగంపై అవగాహన పెంపొందించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శి శ్వేత,రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


