విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి: కలెక్టర్

విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలి: కలెక్టర్

స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ): విద్యార్థి దశ నుంచి క్రమశిక్షణను అలవాటు చేసుకోవాలని, అప్పుడే భవిష్యత్ కు మంచి మార్గం ఏర్పడుతుందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం జనగామ జిల్లా, స్టేషన్ ఘన్‌పూర్ పరిధిలోని కేజీబీవీని కలెక్టర్ సందర్శించారు. ముందుగా వంట గదిలోకి వెళ్లి, ఆర్వో ప్లాంట్, వంట సరకులు, సిద్ధం చేసిన భోజనాన్ని పరిశీలించారు. అరటి పండ్ల నాణ్యత బాగాలేదని, శుభ్రమైన పళ్లను మాత్రమే విద్యార్థులకు అందించాలని అన్నారు. గుడ్లు ఎప్పుడు వచ్చాయని అడిగి, నాణ్యతను నీళ్ళల్లో వేసి పరీక్షించారు. ఆర్వో ప్లాంట్, సరకుల గదిని తనిఖీ చేసి నిర్వహణ సరిగా లేదని, ధాన్యం బస్తాలు, సరకులు, యాసిడ్ లాంటి వస్తువులను ఏ విధంగా ఎక్కడ పెట్టాలో సూచించారు. కేజీబీవీ పరిసరాల చుట్టూ పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని ఎలాంటి చెత్తచెదారం లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్ కమీషనర్ ను ఆదేశించారు. కంప్యూటర్ గదిని పరిశీలించి, విద్యార్థులకు వాటి ద్వారా ఏమేమి నేర్పిస్తున్నారని కంప్యూటర్ ఆపరేటర్ ను అడిగి, కంప్యూటర్ విద్యపై ఆపరేటర్ కు ఉన్న సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం పదవ తరగతిలో అన్ అకాడమీ తరగతులను ప్రారంభించి, ఫాస్ట్ మ్యాథ్స్ పుస్తకాల ప్రాధాన్యతను విద్యార్థులకు వివరించారు. ప్రతి పోటీ పరీక్షలో మ్యాథ్స్ తప్పనిసరిగా ఉంటుందని, ఫస్ట్ మ్యాథ్స్ పుస్తకంలోని అంశాలను నేర్చుకుంటే గణితంలో ఉండే లెక్కల సాధన సులభతరం అవుతుందని అన్నారు. ప్రణాళిక ప్రకారంగా ఉపాధ్యాయులు విద్యార్థులకు అన్ని బోధించాలి సూచించారు. సమస్యలు ఏమైనా ఉంటే ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని కలెక్టర్ ఎస్ఓకు తెలిపారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ స్వప్న, మున్సిపల్ కమీషనర్ రాధాకృష్ణ, సత్యనారాయణ, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.IMG-20260715-WA0309

 

 

 

Views: 289

About The Author

Vision Andhra Telugu Daily Picture

Lorem Ipsum is simply dummy text of the printing and typesetting industry. Lorem Ipsum has been the industry's standard dummy text ever since the 1500s, when an unknown printer took a galley of type and scrambled it to make a type specimen book. It has survived not only five centuries, but also the leap into electronic typesetting, remaining essentially unchanged. It was popularised in the 1960s with the release of Letraset sheets containing Lorem Ipsum passages, and more recently with desktop publishing software like Aldus PageMaker including versions of Lorem Ipsum.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

జాతీయ రహదారిపై వ్యక్తి అనుమానాస్పద మృతి జాతీయ రహదారిపై వ్యక్తి అనుమానాస్పద మృతి
చౌటకూర్ :సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని సుల్తాన్‌పూర్ శివారులో జాతీయ రహదారిపై బుధవారం ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతుడిని హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌కు చెందిన కనగొల్లు...
లింగంపల్లిలో రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం
సింగరేణి భవిష్యత్తుకు తాడిచర్ల–2 మైలురాయి
మీ సేవల్లో ఉచితంగా ఓటరు ఎన్యుమరేషన్ ఆన్‌లైన్ నమోదు : కలెక్టర్ కోయ శ్రీహర్ష
మహిళలను అవమానిస్తూ వ్యాఖ్యలు, శివ చరణ్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి.
చౌడూరులో క్రషర్ రచ్చ
ప్రేమ పేరుతో మైనర్‌పై అమానుషం.. 4 నిందితుల అరెస్ట్