పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
పాపన్నపేట : మండల కేంద్రమైన పాపన్నపేటతో శుక్రవారం రోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్ విజయవంతమైందని జిల్లా ఉపాధ్యక్షులు పాపయ్య,పాపన్నపేట మండల అధ్యక్షులు పర్వయ్య,లు తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ నీట్ లీకేజీ పైన శాంతి యుత నిరసన చేస్తున్న విద్యార్థుల ల పైన జరిపిన దాడినీ నిరసిస్తూ బంద్ సంపూర్ణ విజయ వంతమైనట్లు వారు పేర్కొన్నారు.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మంద్ర రాజీనామా చేయాలని,నీట్ ను రద్దు చేసి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ను విడుదల చేయాలనీ డిమాండ్ చేసారు. కళాశాలలో మధ్యాహ్నం భోజనం వెంటనే చేయాలన్నారు ఈ కార్యక్రమంలొ మండల కార్యదర్శి జశ్వంత్, ఉపాధ్యక్షులు వంశీ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


