ఉట్నూర్ మండల బీజేపీ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా
ఉట్నూర్ /ఆదిలాబాద్ : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ దేశాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు దేశ అభివృద్ధిని తట్టుకోలేక విద్యార్థుల పేరుతో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలు చేపట్టి దేశంలో, రాష్ట్రంలో అశాంతి వాతావరణం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నీట్ పరీక్షకు సంబంధించిన అంశంపై ఇప్పటికే సంబంధిత ప్రక్రియలు కొనసాగుతున్నాయని,విద్యార్థులు పరీక్షలు రాసి కౌన్సెలింగ్‌కు హాజరవుతున్నారని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగులు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేసిందని ఆరోపిస్తూ, ప్రభుత్వం వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Views: 23
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
