కబడ్డీ విజేతలకు రూ.1 లక్ష నగదు పారితోషికం

అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్‌రావు

కబడ్డీ విజేతలకు రూ.1 లక్ష నగదు పారితోషికం

కరీంనగర్, : నేటి విద్యార్థులే రేపటి జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా ఎదుగుతారని, కబడ్డీ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచిన గొప్ప క్రీడ అని జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ వెలిచాల రాజేందర్‌రావు అన్నారు. విజేతలు, రన్నరప్ జట్లను ప్రోత్సహించేందుకు రూ.1 లక్ష నగదు పారితోషికం అందజేస్తానని ప్రకటించారు.శనివారం కరీంనగర్ జగిత్యాల రోడ్డులోని వివేకానందపురి కాలనీలో ఉన్న వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీబీఎస్‌ఈ క్లస్టర్–VII బాలురు, బాలికల కబడ్డీ టోర్నమెంట్–2026ను ఆయన ముఖ్య అతిథిగా ప్రారంభించారుతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీబీఎస్‌ఈ పాఠశాలల నుంచి 160 జట్లు, సుమారు 1,400 మంది విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని చెప్పారు. ఇంత పెద్ద స్థాయిలో టోర్నమెంట్ నిర్వహిస్తున్న వివేకానంద రెసిడెన్షియల్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారుకబడ్డీ కేవలం ఆట మాత్రమే కాదని, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, జట్టు స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను పెంపొందించే గొప్ప క్రీడ అన్నారు. ప్రో కబడ్డీతో ఈ క్రీడకు దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగిందని, ఈ మైదానంలో ఆడుతున్న విద్యార్థుల్లోనే రేపటి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని సూచించారు.సీబీఎస్ఈ హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం డిప్యూటీ సెక్రటరీ & రీజినల్ ఆఫీసర్ జంగం సునీల్ కుమార్ మాట్లాడుతూ, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటుక్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంచుతాయన్నారు. ఓటమిని విజయానికి మెట్టుగా తీసుకొని పట్టుదలతో సాధన చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు డా. చెన్నాడి అమిత్ కుమార్ మాట్లాడుతూ, బాలబాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాలని ఆకాంక్షించారు. నిరంతర సాధన, అంకితభావంతో విజయాలు సాధించవచ్చని అన్నారు. జూలై 25న ప్రారంభమైన ఈ పోటీలు జూలై 27 వరకు జరుగుతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన 160 జట్లు పాల్గొంటున్నాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న, వివేకానంద విద్యాసంస్థల చైర్మన్ పోల్సాని సుధాకర్ రావు, కార్పొరేటర్లు గంట శ్రీనివాస్, ఇక్రమ్ సికిందర్, గుమ్మడి రాజకుమార్, జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు చి. సంపత్‌రావు, కార్యదర్శి బి. మల్లేష్ గౌడ్, మానేరు స్కూల్ చైర్మన్ అనంత రెడ్డి, వివేకానంద స్కూల్ అకాడెమిక్స్ డైరెక్టర్ డా. టి. లలితా కుమారి, ప్రిన్సిపాల్ డా. ఆర్. రితీష్ తదితరులు పాల్గొన్నారు.
 
 
Views: 45

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News