సాయన్నపేట మూలమలుపు వద్ద ఆటో బోల్తా

సాయన్నపేట మూలమలుపు వద్ద ఆటో బోల్తా

టేకులపల్లి, (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) :సింగరేణి మండలం కొత్తగూడెం నుంచి టేకులపల్లి మండల సంతకు ఆటోలో కూరగాయలు తీసుకుని వస్తుండగా టేకులపల్లి మండలం సాయన్నపేట మూలమలుపు వద్ద ఆటో టైరు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది.ఈ ప్రమాద సమయంలో ఆటోలో నలుగురు ప్రయాణికులు ఉన్నారు. వారిలో అజ్మీర పద్మ (40), భర్త కృష్ణకు నడుము భాగం మరియు పక్కటెముకలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే టేకులపల్లి 108 అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుంది. ఈఎంటి సునీత, పైలెట్ నాగేశ్వరరావు గాయపడిన వారికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, అంబులెన్స్‌లో ఇల్లందు ఏరియా ఆస్పత్రికి తరలించి వైద్యుల పర్యవేక్షణలో చేర్పించారు.స్థానికులు 108 అత్యవసర సేవల సిబ్బంది వేగంగా స్పందించి క్షతగాత్రులను సురక్షితంగా ఆస్పత్రికి తరలించిన తీరును అభినందించారు.
Views: 207

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News