ఎన్యుమరేషన్,డిజిటైజేషన్ పనులు వేగంగా పూర్తి చేయాలి జాయింట్ కలెక్టర్

ఎన్యుమరేషన్,డిజిటైజేషన్ పనులు వేగంగా పూర్తి చేయాలి జాయింట్ కలెక్టర్

నాగర్‌కర్నూల్, బిజీనపల్లి :పాలెం గ్రామంలో శనివారం జాయింట్ కలెక్టర్ రెవెన్యూ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని పి.ఎస్.నెంబర్ 43,44,45,46లలో జరుగుతున్న ఎన్యుమరేషన్ పనులను పరిశీలించారు.ఎన్యుమరేషన్ ఫారాల వివరాలు,డిజిటైజేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో స్వయంగా చెక్ చేశారు.ఈ సందర్భంగా అధికారులు,ఫీల్డ్ సిబ్బందితో సమావేశమైన జాయింట్ కలెక్టర్ డిజిటైజేషన్ పనులను నిర్ణీత గడువులోగా 100% పూర్తి చేయాలని కఠిన ఆదేశాలు జారీ చేశారు.పనుల్లో ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు.అర్హులైన ప్రతి లబ్ధిదారుడి వివరాలు సరిగ్గా నమోదు అయ్యేలా చూడాలని,తప్పులు లేకుండా డేటా ఎంట్రీ చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఆర్.ఐ,వి.ఆర్.ఓలు,ఎన్యుమరేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News