దేశద్రోహులను సమర్థించే కాంగ్రెస్ వైఖరిని ప్రజలు క్షమించరు
మర్పల్లి, (వికారాబాద్ జిల్లా): దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ పరోక్షంగా మద్దతు ఇస్తోందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ మర్పల్లి మండల శాఖ ఆధ్వర్యంలో శనివారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ మర్పల్లి మండల అధ్యక్షుడు రామేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలకే కాంగ్రెస్ పెద్దపీట వేస్తోందని విమర్శించారు.దేశ సమగ్రత, జాతీయ భద్రతకు విఘాతం కలిగించే శక్తులను కాంగ్రెస్ పార్టీ పదేపదే సమర్థించడం దురదృష్టకరమని ఆయన అన్నారు. దేశద్రోహ భావజాలాన్ని ప్రోత్సహించే వారిపై బీజేపీ ఎప్పటికీ రాజీ పడదని స్పష్టం చేశారు.జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష నీట్ విషయంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరో విధంగా వ్యవహరిస్తోందని రామేశ్వర్ రెడ్డి విమర్శించారు. నీట్ పరీక్షను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ విద్యార్థులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందన్నారు. పేపర్ లీక్ అంశాన్ని అడ్డుపెట్టుకుని దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.తెలంగాణలో విద్యార్థులు, రైతులు, నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కనపెట్టి ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు కాంగ్రెస్ పాల్పడుతోందని ఆయన విమర్శించారు. దేశ సమగ్రత, రాజ్యాంగ పరిరక్షణ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలాంటి రాజీ పడదని, దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించే శక్తులపై పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి శ్రీమంత్ కుమార్, నాయకులు లక్ష్మన్, బలరాం గౌడ్, జైపాల్, మలేష్, మధు, గణేష్, రమేష్, సంగమేశ్వర్, శేఖర్, నాగేష్, రవీందర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, మాణిక్యం, భద్రన్న, బలవత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Views: 63
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
