రెండు నెలల వేతనాలు విడుదల చేయాలని ఫీల్డ్ అసిస్టెంట్ల వినతి
దౌల్తాబాద్(సిద్ధిపేట్): మండలంలో విధులు నిర్వహిస్తున్న ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలుగా వేతనాలు అందడం లేదని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ శుక్రవారం ఎంపీడీఓ, ఏపీఓ రాజుకు వినతిపత్రం అందజేశారు. రెండు నెలలుగా జీతాలు అందక కుటుంబ పోషణ, పిల్లల విద్య, నిత్యావసర ఖర్చులు నిర్వహించడం కష్టంగా మారిందని వారు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించడంతో పాటు ఇకపై ప్రతి నెలా సకాలంలో జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో గజిబింకర్ శ్రీనివాస్, పాశం నర్సింలు, కొండల్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


