వివాహిత ప్రాణాలు కాపాడిన పోలీసులు

వివాహిత ప్రాణాలు కాపాడిన  పోలీసులు

కరీంనగర్, : కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దుర్షేడు గ్రామానికి చెందిన నేతి మానస(23) అనే వివాహిత కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారుఈ సమాచారం అందుకున్న కరీంనగర్ రూరల్ ఇన్‌స్పెక్టర్ నిరంజన్ గారి ఆదేశాల మేరకు, బ్లూకోల్ట్స్ సిబ్బంది అఫ్జల్ మరియు హోంగార్డు ప్రసాద్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని, సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆమెను సురక్షితంగా కాపాడారు.అనంతరం సదరు మహిళకు కౌన్సిలింగ్ నిర్వహించి, మానసిక ధైర్యాన్ని నింపి సురక్షితంగా కుటుంబ సభ్యులకు అప్పగించారు. క్లిష్ట సమయంలో వేగంగా స్పందించి ఒక అమూల్యమైన ప్రాణాన్ని కాపాడిన బ్లూకోల్ట్స్ సిబ్బంది అఫ్జల్ హోంగార్డు ప్రసాద్‌లను ఏసీపీ విజయకుమార్, సీపీ గౌష్ ఆలం ప్రత్యేకంగా అభినందించారు.
Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News