విద్యాసంస్థల బంద్‌కు సహకరించిన వారికి విద్యార్థి, యువజన సంఘాల కృతజ్ఞతలు

విద్యాసంస్థల బంద్‌కు సహకరించిన వారికి విద్యార్థి, యువజన సంఘాల కృతజ్ఞతలు

ఉట్నూర్: దేశవ్యాప్తంగా జరిగిన నీట్ పేపర్ లీక్ ఘటనతో పాటు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన విద్యాసంస్థల బంద్‌కు సహకరించిన అన్ని విద్యాసంస్థలు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఉట్నూర్ మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించగా, ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలు లేక ఉదయం తెరుచుకున్నాయి. అనంతరం విద్యార్థి, యువజన సంఘాల విజ్ఞప్తి మేరకు ఏజెన్సీ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు కూడా బంద్ పాటించాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ నాయకులు అరకిల్ల పరమేశ్వర్, ధర్మ సమాజ్ స్టూడెంట్స్ యూనియన్ నాయకుడు హరి ప్రసాద్, బీఎస్పీ పార్లమెంట్ ఇంచార్జ్ సంజయ్, యూత్ కాంగ్రెస్ మండల నాయకులు రాజ్‌కుమార్, సామాజిక కార్యకర్త సిడం శేషు, అర్జున్, సల్మాన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
 
Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News