చిల్పూరుగుట్టలో ఘనంగా తొలి ఏకాదశి వేడుకలు
స్టేషన్ ఘన్‌పూర్, (జనగామ) :చిల్పూర్ గుట్ట శ్రీ బుగులు వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా స్వామివారు వివిధ రకాల ఫలాలు, పుష్పాలతో ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారికి వేదమంత్రోచ్చరణలతో అర్చకులు వైభవంగా పూజలు నిర్వహించారు, ఈసందర్భంగా ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఉత్సవ మూర్తులను వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు చతుర్భుజుడిగా దివ్యమైన ఆభరణాలు ధరించి, లక్ష్మీ సమేతుడై ఆనందంగా కొలువై ఉంటాడని అన్నారు. ఆయన ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ భక్తులకు అభయం ఇస్తుంటారని తెలిపారు. స్వామి వారికి దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు కిరణ్మయి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ వాస్తవ్యులు యల్లంకి ప్రసాద్ జ్యోతి, సాయి శరణ్య, దిలీప్, నవ్య సాయి సహకారంతో అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు. ఈకార్యక్రమంలో దేవాలయ ఈవో లక్ష్మీ ప్రసన్న, ధర్మకర్త మండలి సభ్యులు, గణగోని రమేష్, దారం రాజన్ బాబు, గొల్లపల్లి వాసు, కండూరి రంగరాజు, గోలి రాజశేఖర్, వేముల వెంకటేశ్వర్లు, రత్నాకర్ రెడ్డి, భుక్య శీను, జూనియర్ అసిస్టెంట్ ch రాజేందర్ రెడ్డి, పుల్యాల నారాయణరెడ్డి, అరుణ రమేష్, సూర్యనారాయణ, అర్చకులు బ్రాహ్మణపల్లి రవీందర్ శర్మ, సౌమిత్రి శ్రీరంగాచార్యులు, కృష్ణమాచార్యులు చెరువు ఆదిత్య, భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

Views: 63
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
