రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు

మంత్రి దామోదర రాజనర్సింహకు గిరిజన నాయకుల కృతజ్ఞతలు

రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు

చౌటకూర్ : కేంద్రంలో రూ.35.50 కోట్ల వ్యయంతో ట్రైబల్ లా కాలేజీని మంజూరు చేయించిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహకు బొమ్మరెడ్డిగూడెం తాండ గిరిజన నాయకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గిరిజన నాయకుడు ఆర్. గోపాల్ మాట్లాడుతూ, గిరిజన యువత న్యాయ విద్యను అభ్యసించి ఉన్నత స్థానాలకు ఎదగాలనే లక్ష్యంతో ట్రైబల్ లా కాలేజీని మంజూరు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఈ అవకాశాన్ని కల్పించిన మంత్రి దామోదర రాజనర్సింహకు గిరిజన సమాజం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అందోల్ నియోజకవర్గంలో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సరపల్లి రామచందర్ రెడ్డి, సాయిలు, బొమ్మరెడ్డిగూడెం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు హరిసింగ్, ఆర్. గోపాల్, రాములు, మేఘరాజ్ నాయక్, మహేష్ రాథోడ్, గణేష్ జాదవ్, కిషన్ (డీలర్), దుర్వాష్, జైల్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

 కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ కేజీబీవీలో విద్యార్థినులకు యూనిఫాంల పంపిణీ
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
పాపన్నపేటలో విద్యా సంస్థల బంద్ విజయవంతం
ఎన్నికల్లో దళితులకు 15 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలి
రూ.35.50 కోట్ల ట్రైబల్ లా కాలేజీ మంజూరు
సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి
ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రతి డివిజన్ లో సమగ్ర అభివృద్ధి లక్ష్యం