దీపాయంపల్లిలో డ్రై డే–ఫ్రై డే నిర్వహణ

దీపాయంపల్లిలో డ్రై డే–ఫ్రై డే నిర్వహణ

దౌల్తాబాద్(సిద్ధిపేట్): సీజనల్ వ్యాధుల నివారణకు గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని దీపాయంపల్లి గ్రామ సర్పంచ్ గజ్వేల్ దుర్గేశ్ సూచించారు. మండలంలోని దీపాయంపల్లి గ్రామంలో శుక్రవారం సర్పంచ్ ఆధ్వర్యంలో డ్రై డే–ఫ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు, కాలువలు, నీరు నిల్వ ఉండే ప్రాంతాలను పరిశీలించి ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు. డెంగ్యూ, మలేరియా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నివారించేందుకు నిల్వ నీటిని తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని గ్రామస్థులకు సూచించారు. ఇంటి పరిసరాల్లో పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, నీరు నిల్వ ఉండే పాత్రలను ఎప్పటికప్పుడు ఖాళీ చేయాలని అవగాహన కల్పించారు.అలాగే ప్రతి శుక్రవారం డ్రై డే పాటించడం ద్వారా దోమల ఉత్పత్తిని  తగ్గించవచ్చని తెలిపారు. గ్రామ ప్రజలు తమ ఇళ్లలో, పరిసరాల్లో పరిశుభ్రత పాటించి ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని నెలకొల్పేందుకు సహకరించాలని కోరారు.

Views: 39

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News