సామాజిక ఆసుపత్రిలో గైనకాలజిస్ట్‌ను కొనసాగించాలి
ముథోల్,: ముథోల్ సామాజిక ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న గైనకాలజిస్ట్ (ఎంఎస్) వైద్యాధికారిని బోథ్‌కు మార్పు చేయాలన్న నిర్ణయాన్ని రద్దు చేసి ముథోల్‌లోనే కొనసాగించాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. శుక్రవారం ముథోల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ షబానా బేగం ఏజాజోద్దీన్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఈ మేరకు తీర్మానం ఆమోదించారు. గ్రామసభలో సర్పంచ్ మాట్లాడుతూ ముథోల్ మండలంతో పాటు బాసర, తానూర్ మండలాలకు చెందిన ప్రజలు కూడా వైద్య సేవల కోసం ముథోల్ సామాజిక ఆసుపత్రికి వస్తారని తెలిపారు. ముఖ్యంగా గర్భిణులు, బాలింతలు, మహిళలకు గైనకాలజిస్ట్ సేవలు అత్యంత అవసరమని, ఈ వైద్యాధికారిని మార్పు చేస్తే వేలాది మంది మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. గైనకాలజిస్ట్ మార్పు నిర్ణయంపై ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని గైనకాలజిస్ట్‌ను ముథోల్ సామాజిక ఆసుపత్రిలోనే కొనసాగించాలని గ్రామసభ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ తీర్మాన ప్రతిని భైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, జిల్లా వైద్య మరియు ఆరోగ్య సేవల సమన్వయ అధికారి (డీసీహెచ్‌ఎస్) డాక్టర్ కాశినాథ్‌కు అందజేసి మార్పు ఉత్తర్వులను పునఃపరిశీలించి రద్దు చేయాలని ప్రజాప్రతినిధులు కోరనున్నట్లు తెలిపారు.
Views: 66
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
24 Jul 2026 18:44:48
దౌల్తాబాద్ (సిద్ధిపేట్): మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ఏకరూప దుస్తులను మండల విద్యాధికారి గజ్జెల కనకరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...
