ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
కారేపల్లి(ఖమ్మం) : వైరా శాసనసభ్యులు మాలోత్ రాందాస్ నాయక్ పుట్టినరోజునీ పురస్కరించుకొని గేట్ కారేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కాంగ్రెస్ నాయకులు గుడిపూడి తిరుమలరావు పుస్తక బ్యాగులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నియోజకవర్గ అభివృద్ధికై నిరంతరం శ్రమిస్తున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మరెన్నో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానమని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, గ్రామ పంచాయతీ కార్యదర్శి అనూష,గ్రామ సర్పంచ్ పూసం ఎల్లయ్య,ఉప సర్పంచ్ కందుల శ్రీనివాసరావు,వార్డు సభ్యులు జక్కుల కుమార్, ఓరికొర్ల వీరభద్రం,సామినేని తిరుపతి రావు,తాళ్లూరి అప్పారావు,చెరుకూరి రామారావు,మందా రామారావు,చెరుకూరి కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
Views: 53
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
