వారం రోజుల్లో భగత్ నగర్ లో పడిన దొంగలను పట్టుకోవాలి

వారం రోజుల్లో భగత్ నగర్ లో పడిన దొంగలను పట్టుకోవాలి

కరీంనగర్, : కరీంనగర్‌లో శాంతిభద్రతలు క్షీణించాయని, వరుస దోపిడీలు జరుగుతున్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భగత్ నగర్‌లో దోపిడీకి గురైన మున్నాభాయ్ కుటుంబాన్ని శనివారం పరామర్శించారువారం రోజుల్లో నిందితులను అరెస్ట్ చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. జూన్‌లో కారు చోరీ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని బాధితులు తెలిపారు. అప్పుడే స్పందించి ఉంటే ఈ భారీ దోపిడీ జరిగేది కాదన్నారు. దుండగులు ఇంట్లోకి వచ్చి 62 తులాల బంగారం, రూ.25 లక్షల నగదు దోచుకున్నారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజీ ఇచ్చినా నిందితులను పట్టుకోలేదని గంగుల విమర్శించారుకరీంనగర్ దొంగలకు అడ్డాగా మారిందని, పీఎంజే జ్యువెలర్స్ దోపిడీ నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదని ఆరోపించారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఉన్న శ్రద్ధ దొంగల పట్టుపై లేదన్నారు. బాధిత కుటుంబానికి పోలీసులు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారుఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు గుగ్గిళ్ళ జయశ్రీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News