సొంత డబ్బులతో వార్డులో అభివృద్ధి పనులు చేశా
- అ దమ్ము ధైర్యం మీకు ఉందా..?
- ఎమ్మెల్యేకు సవాలు విసిరిన మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి.
- చిలుక వాగు కబ్జా నుండి కాపాడా.. ఎలాంటి కబ్జాకు పాల్పడలేదు.
- సొంత నిధులతో పూడికతీత పనులు చేపట్టా.. ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు.
తాండూరు, (వికారాబాద్): గతంలో కౌన్సిలర్ గా 13వ వార్డులో సొంత డబ్బులతో అభివృద్ధి చేసిన ఘనత నాదని.. ఆ దమ్ము ధైర్యం మీకు ఉందా అంటూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి మాజీ కౌన్సిలర్ వరాల శ్రీనివాసరెడ్డి సవాలు చేశారు. తనపై అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు తనపై చిలక వాగును కబ్జాకు పాల్పడ్డాను అంటూ కొందరు లేనిపోని ఆరోపణలు చేయడం బురద జల్లడం మానుకోవాలని సూచించారు. తాను గతంలో వార్డు కౌన్సిలర్ గా సొంత డబ్బులతో చిలక వాగును పూడిక తీసి తీసినట్లు వెల్లడించారు. ప్రభుత్వం నుండి ఎలాంటి ఒక్క రూపాయి తీసుకోకుండా కాలనీవాసుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని చిలుకవగును ప్రక్షాళన చేశానని అన్నారు.తాను చిలుక వాగును కబ్జా చేశానని అవాస్త ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియాలో నాపై గలీజుగా కామెంట్లు పెడుతున్నారని కాలనీ వాసుల సమస్యలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు చిలుక వాగులో పూడికతీత తీసి వెడల్పు చేశామని అన్నారు. గతంలో చిలుక వాగు వాగుల కాకుండా కనీసం కల్వర్టుగా కూడా ఉండేది కాదని చిలుక వాగును ప్రక్షాళన చేసిన ఘనత నాదేనని అన్నారు. చిలక వాగు ప్రక్షాళనకు ఎమ్మెల్యే నిధుల నడి ఏమైనా నిధులు పెట్టారా అంటూ ప్రశ్నించారు. చిలకబాబు సమస్య 13వ వార్డులో ఉంటే గతంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మంజూరు చేసిన 16 కోట్ల నిధులతో ప్రస్తుత నాయకులు మున్సిపల్ చైర్ పర్సన్ నీరజ బాల్రెడ్డి వేరే చోట నుండి 10 ఫీట్ల చిలక వాగును కల్వర్టును నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు. గతంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వార్డు అభివృద్ధికి కృషి చేసి నిధులు కేటాయించారని గుర్తు చేశారు. తాను ఎవరి భూమిని కబ్జా చేయలేదని చిలక వాగు ప్రక్షాళన భాగంగానే చిలక వాగును పూడిక తీసినట్లు తెలిపారు. తాను ప్రభుత్వం నుండి ఎక్కడైనా ఒక రూపాయి తీసుకున్నట్లు ఉంటే మున్సిపల్ లో గాని ఎక్కడైనా చూసుకోవచ్చని అన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 13వ వార్డును అభివృద్ధి చేస్తున్నారని చెప్పడం అవాస్తమని ఎలాంటి నిధులు కేటాయిం చకుండా అభివృద్ధి ఎక్కడ చేశారు చెప్పాలని డిమాండ్ చేశారు. కబ్జాకు పాల్పడ్డానంటూ అవాస్తవాలు ఆరోపణలు చేయడం మానుకోవాలని ఎమ్మెల్యే తన అనుచరులకు పార్టీ నాయకులకు చెప్పాలని సూచించారు. ఈ సమావేశంలో స్థానిక వార్డు నాయకులు రమేష్ గౌడ్, అబ్రర్ లాల ,అబ్దుల్ అజీజ్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు.
Views: 7
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
25 Jul 2026 18:16:22
సిద్ధిపేట / మర్కుక్ : పాండురంగ ఆశ్రమంలో 95 వ ఆషాడి ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకున్నాయి.శనివారం తొలి ఏకాదశి సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తుల తాకిడి...
